రాజ్యాంగ హక్కులను పరిరక్షించండి: డా”ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు, బహుజన్ సమాజ్ పార్టీ, తెలంగాణతెలంగాణ.

రాజ్యాంగ హక్కులను పరిరక్షించండి: డా”ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు, బహుజన్ సమాజ్ పార్టీ, తెలంగాణతెలంగాణ.
పంచాయితీ రాజ్ చట్టం-2018 ప్రకారం జనాభా ప్రాతిపదికన కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఎస్టీ (మహిళ) కు రిజర్వ్ చేయబడింది. ఇంతకాలం ZP చైర్ పర్సన్ గా ఉన్న కోవ లక్ష్మీ గారు ప్రస్తుతం MLA గా ఎన్నికయ్యారు. ఏజెన్సీ ఏరియాలో ఎస్టీ (మహిళ) కు రిజర్వ్ చేయబడ్డ చైర్ పర్సన్ పదవికి జనరల్ కేటగిరీకి చెందిన ప్రస్తుత జిల్లా వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావును తాత్కాలికంగా ZP చైర్మన్ గా ఎంపిక చేయడం,రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకం.ఆదివాసీలకు దక్కిన రాజ్యాంగ హక్కులను ఆధిపత్య వర్గాలు తమ చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం ప్రతి చోటా చేస్తున్నారు.

అందుకే ఎటువంటి కాలయాపన చేయకుండా తక్షణమే రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవికి ఎన్నికలు నిర్వహించి మరో ఎస్టీ (మహిళ) ను ఎంపిక చేయాలని #BSP డిమాండ్ చేస్తున్నది. లేని పక్షంలో రాజ్యాంగబద్దంగా,చట్టప్రకారం ప్రభుత్వంపై న్యాయ పోరాటానికి సిద్ధం అవుతామని డా”ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు, బహుజన్ సమాజ్ పార్టీ గారు X వేదిక గా స్పందించారు.