తాగునీటి సమస్యలతో ఇబ్బందులు

తాగునీటి సమస్యలతో ఇబ్బందులు :

జ్ఞాన తెలంగాణ, నారాయణపేట ,ఏప్రిల్ 18:

నారాయణపేట జిల్లాలోని కృష్ణ మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు.గ్రామాలకు కూతవేటు దూరంలో జీవ నదులు ఉన్నప్పటికీ నీటికి మాత్రం చింత తప్పడం లేదు.గ్రామంలో ఉన్న బోరుబావులు నుండి మంచినీటి సౌకర్యం కల్పించాలని అధికారులని కోరిన గ్రామస్తులు మండలంలోని తంగేడు, సుకూరు, లింగంపల్లి గ్రామాలు ఎత్తు ప్రదేశంలో ఉన్నాయని కారణంతో మిషన్ భగీరథ పనులు చేపట్టలేదు.తాగునీటి సమస్య అందక ప్రజలు, ఆయా గ్రామాల ప్రజలు బోరు బావుల మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. పలు పంట నష్టాలు ఇప్పటికే ఎన్నో రకాలుగా నష్టాన్ని సృష్టించాయి.ఇప్పటికీ ఎన్ని కార్య క్రమాలు చేపట్టిన కూడా తాగునీటి సమస్య ఉద్భవిస్తుంది.
బోరు వద్ద గంటల తరబడి నిరీక్షిస్తున్నారు.

You may also like...

Translate »