రోడ్డు ప్రమాదంలో వ్యక్తి గాయాలు

మధిర, నవంబర్ 6 (జ్ఞానతెలంగాణ):
మధిర రెడ్డి గార్డెన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. వివరాల ప్రకారం, ఆటో ఒక టీవీఎస్ ఎక్సెల్ వాహనాన్ని ఢీకొట్టబోయే సమయంలో, టీవీఎస్ ఎక్సెల్ వాహనదారుడు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో వాహనదారుడికి తలపై గాయాలైనట్లు సమాచారం.
ఇప్పటికే మధిర కేంద్రంలో వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా మధిర–వైరా ప్రధాన రహదారిపై గుంటలతో నిండిన రోడ్ల కారణంగా ప్రమాదాలు పెరుగుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు.
ఎన్ని ప్రమాదాలు జరిగినా రోడ్లు మరమ్మతు చేయడంలో ఆర్ అండ్ బి అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
