రెండు ద్విచక్ర వాహనాలు ఢీ ఆసుపత్రికి తరలిస్తుండగా పాషా మృతి

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ ఆసుపత్రికి తరలిస్తుండగా పాషా మృతి
జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి :
ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్న సంఘటనలో ఒక వ్యక్తి మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన శంకరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. శంకర్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం…. మహాలింగాపురం గ్రామానికి చెందిన పకీర్ పాషా (60) ఆదివారం తన మోటారు బైకుపై శంకర్ పల్లి కి వస్తుండగా అదే గ్రామానికి చెందిన భీమ్ రావు శంకర్పల్లి నుంచి స్వగ్రామానికి వస్తుండగా మహాలింగాపురం గ్రామ సమీపంలోని కల్వర్టు వద్ద రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో గాయపడిన ఇద్దరినీ 108 అంబులెన్స్ లో ఫతేపూర్ వద్ద గల విజయ హాస్పిటల్ కి తరలించారు. చికిత్స పొందుతూ పకీర్ పాషా మృతి చెందాడు. మరో వ్యక్తి భీమ్ రావును మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు శంకరపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
