తెలంగాణలో ఆంధ్ర వ్యతిరేకత ఉద్యమం అంతగా క్లిక్ కావడం లేదని అనుకుంటున్నారేమో కానీ ఇప్పుడు మార్వాడీ గో బ్యాక్ అనే నినాదాన్ని అందుకుంటున్నారు. మెల్లగా సోషల్ మీడియాతో ప్రారంభించి.. రోడ్ల మీదకు తెచ్చేలా ప్లాన్లు ప్రారంభమయ్యాయి. తెలంగాణలో ఎక్కడ చూసినా మార్వాడీలు ఉంటారు. అన్ని వ్యాపారాలూ వారే చేస్తూంటారు. వారిపై ప్రజల్లో అసహనం కలిగిస్తే.. చాలు ఓట్ల వర్షం కురుస్తోందని ప్లాన్ చేసుకునే రాజకీయాలు ప్రారంభమవుతున్నాయి. ఆంధ్రా కన్నా ఇప్పుడు మార్వాడీలపై అసహనం పెంచడం సులువు అనుకుంటున్నారు.
హైదరాబాద్ శివారులో ఒక దుకాణం వద్ద మార్వాడీ వ్యాపారులు ఒక స్థానిక వ్యక్తిపై వాహనం పార్కింగ్ విషయంలో జరిగిన వివాదంలో దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది, దీనితో “మార్వాడీ గో బ్యాక్” అనే నినాదం ప్రారంభమయింది. మెల్లగా ఇది అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. స్థానిక వ్యాపారులు మార్వాడీలు తమ చిన్న వ్యాపారాలను ఆక్రమిస్తూ, స్థానికుల జీవనోపాధిని దెబ్బతీస్తున్నారని ఆరోపిస్తూ నిరసనలు చేపట్టారు. కొన్ని ప్రాంతాల్లో ఈనెల 18న స్వచ్ఛంద బంద్‌కు పిలుపునిచ్చారు