మీర్జాగూడ బస్సు ప్రమాదంలో మరణించిన నాగమణి కుటుంబానికి 7 లక్షల పరిహారం అందజేత

జ్ఞానతెలంగాణ, చేవెళ్ల:
ఈ నెల 3వ తేదీన జరిగిన మీర్జాగూడ బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కర్ణాటక రాష్ట్రం, గుల్బర్గా జిల్లా, షెడం తాలూకా, బానూర్ గ్రామానికి చెందిన నాగమణి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.7,00,000/- (రూపాయలు ఏడు లక్షలు) ఆర్థిక సాయం ప్రకటించింది.

ఈరోజు చేవెళ్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య నాగమణి కుటుంబ సభ్యులకు నష్టపరిహార చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా కాలే యాదయ్య మాట్లాడుతూ ఈ నెల 3వ తేదీన జరిగిన మీర్జాగూడ బస్సు ప్రమాదం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. చనిపోయిన వారిని తిరిగి తీసుకురావడం సాధ్యం కాకపోయినా, ఆ కుటుంబానికి అండగా నిలవడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. ఆపదలో ఉన్న కుటుంబానికి మానవతా దృక్పథంతో 7 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.

You may also like...

Translate »