దానవాయిగూడెం ప్రజల సమస్యలను తీర్చడమే నా ఎజెండా : దామల రవి

జ్ఞాన తెలంగాణ, ఖమ్మం జిల్లా,ప్రతినిధి, అక్టోబర్ 29:
ఖమ్మం మున్నేరు కరకట్ట నిర్మాణం కారణంగా నిర్మాణానికి సంబంధించిన బారి వాహనాలు దానవైగూడెం ప్రధాన రహదారీ గుండా తిరగడం వలన రోడ్డు గుంతలు పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున విషయం తెలుసుకొని స్థానికంగా ఉన్న అన్ని పార్టీలు బిఆర్ఎస్, బిజెపి, సిపిఐ నాయకులు వెళ్లి కాంట్రాక్టర్లును కలిసి రోడ్డు గుంతలు పుడిచి ప్రజల ఇబ్బందులను తొలగించాలని మాట్లాడడం జరిగింది వెంటనే కాంట్రాక్టర్ స్పందించి రేపటి లోపు గుంటలు పూడ్చుతానని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ 59 డివిజన్ మాజీ అధ్యక్షులు దామల రవి గారు, మద్దెల ఉదయ్, బత్తుల యేసు, బీజేపీ యువ నాయకులు వల్లల రమేష్, సిపిఐ నాయకులు ప్రతాపనేని వెంకటేశ్వర్లు, తిరపయ్య, తదితర నాయకులు పాల్గొనడం జరిగింది
