ముదిరాజులు అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుండాలి

ముదిరాజులు అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుండాలి
- ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో కాలమాని ఆవిష్కరణ
- తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్.
జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, డిసెంబర్ 29 :ముదిరాజులు అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందంజలో ఉండాలని తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ అన్నారు. ఆదివారం హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో ముదిరాజుల కాలమానిని ఆవిష్కరించారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ పురపాలక పరిధిలో మండల ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు గణేష్ గుప్తా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు బొబ్బిలి మనోజ్ కుమార్ సమక్షంలో నూతన కాలమానిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ముదిరాజులు అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందంజలో ఉండాలని ఆ దిశగా కృషి చేయాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బొబ్బిలి మనోజ్, ముదిరాజ్, ఉపాధ్యక్షులు నూకం మురళి ముదిరాజ్, కమిటీ సభ్యులు మాలి రాము ముదిరాజ్, కొండ్రముని శ్రీశైలం ముదిరాజ్, నిమ్మ వేద వ్యాస్ ముదిరాజ్, బొబ్బిలి దీపక్ ముదిరాజ్, పంతులు శశికాంత్ మదిరాజ్, సారుగుల్ల చందు ముదిరాజ్, పిట్టల మహేష్ ముదిరాజ్, పూలపల్లి శేఖర్ ముదిరాజ్, బైరమణి శ్యామ్ ముదిరాజ్, మేకల లక్ష్మణ్ ముదిరాజ్, పూలపల్లి సిద్ధులు ముదిరాజ్, క్యాతరమౌని తిరుపతయ్య ముదిరాజ్, కొండ్రముని దర్శన్ ముదిరాజ్, ఆవుల ఆకాష్ ముదిరాజ్ బొబ్బిలి జైచంద్ర ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

