శని త్రయోదశి శనీశ్వరుడికి తైలాభిషేకం అభిషేకం లో పాల్గొన్నఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

శని త్రయోదశి శనీశ్వరుడికి తైలాభిషేకం అభిషేకం లో పాల్గొన్నఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్,
జ్ఞానతెలంగాణ రాజేంద్రనగర్,డిసెంబర్ 28:
మదనపల్లి గ్రామంలో శంకర్ రాజు ముఖియా దేవాలయ చైర్మన్ ఆధ్వర్యంలో ఈరోజు శని త్రయోదశి సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శనికి తైలాభిషేకం గావించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…శనీశ్వర దేవుడిని ఆరాధించడం వల్లజీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. శనీశ్వరుడి అనుగ్రహం వల్ల మనిషికి కీర్తి, ఐశ్వర్యం లభిస్తాయి అని తెలిపారు ఈ పూజా కార్యక్రమంలో సీనియర్ నాయకులు గణేష్ గుప్తా , దూడల వెంకటేష్ గౌడ్ కౌన్సిలర్ మేకల వెంకటేష్,చంద్రారెడ్డి,ఘాన్సిమియా గూడా జగన్ గౌడ్ రామ్నాథ్ ముదిరాజు తదితరులు పాల్గొన్నారు
