కేటీఆర్ పై విరుచుకుపడ్డ : మంత్రి సీతక్క.

కేటీఆర్ పై విరుచుకుపడ్డ : మంత్రి సీతక్క.

హైద‌రాబాద్:డిసెంబర్ 13 కేటీఆర్ అప్ప‌డే తొంద‌ర‌ప‌డి విమ‌ర్శ‌లు చేయకండి అసలు కథ ముందుంది అంటూ కెటిఆర్ కు మంత్రి సీత‌క్క కౌంట‌ర్ ఇచ్చారు..అధికారంలోకి వ‌చ్చిన రెండు రోజుల‌లో కీల‌క హామీలు అమ‌లు చేస్తామని మాట ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు నింద త‌మ‌పై వేస్తుందంటూ కెటిఆర్ చేసిన కామెంట్స్ పై ఆమె మండిప‌డ్డారు..

ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సాధ్యం కాని హామీలు ఇచ్చారన్న వ్యాఖ్యాల‌ను తీవ్రంగా ఖండించారు..అసెంబ్లీ లాబీలో ఆమె నేడు మీడియాతో మాట్లాడుతూ, బీఆర్ఎస్ నేతలకు అంత తొందర పాటు వద్దన్నారు. అధికారం పోయిందన్న బాధ కేటీఆర్‌ను వెంటాడు తోందన్నారు.అయితే..తాము ఇస్తా అన్న దానికి బీఆర్ఎస్ వాళ్ళు పెంచి చెప్పారు కదా? అని ప్రశ్నించారు.

కాగా..కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని ఆమలు చేస్తామని స్పష్టంచేశారు.ఒక్కో హామీని క్ర‌మ ప‌ద్ద‌తిలో అమలు చేస్తు న్నామని క్లారిటీ ఇచ్చారు. రైతులకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటా మని తెలిపారు.కాంగ్రెస్‌ను గెలిపించి నందుకు ప్రజలంతా సంతో షంగాఉన్నారన్నారు.

You may also like...

Translate »