రిమ్స్ హాస్పిటల్లో అర్ధరాత్రి ఘర్షణ: బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ జూనియర్ డాక్టర్ల నిరసన.

రిమ్స్ హాస్పిటల్లో అర్ధరాత్రి ఘర్షణ: బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ జూనియర్ డాక్టర్ల నిరసన.
ఆదిలాబాద్ డిసెంబర్ 14:ఆదిలాబాద్ రిమ్స్ మెడికల్ కాలేజీ ఆవరణలో బుధ వారం అర్ధరాత్రి ఘర్షణ చోటు చేసుకున్నది.క్యాంపస్‌లోకి బయటి వ్యక్తులు చొరబడి తమపై దాడి చేశారని వైద్య విద్యార్థులు ఆరోపి స్తున్నారు ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తోపులాట ఘర్షణ చోటు చేసుకుందని తెలుస్తున్నది.
ఈ క్రమంలో ఇంటర్న్‌షిప్ చేస్తున్న ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు దీంతో క్యాంపస్‌లో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.క్రాంతి అనే అసిస్టెంట్ ప్రొఫెసర్ తో పాటు క్యాంప స్‌లోకి వచ్చిన బయటి వ్యక్తులే తమపై దాడికి పాల్పడ్డారని జూనియర్ డాక్టర్లు ఆరోపిస్తున్నారు.కాలేజీ హాస్టల్ వద్ద ధర్నాకు దిగారు వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు డాక్టర్ క్రాంతి దిష్టిబొమ్మను దహనం చేశారు.వసీం అనే వ్యక్తితో కలిసి మరో ముగ్గురు దాడికి పాల్పడ్డారని చెప్పారు అయితే మెయిన్ గేట్ సెక్యూరిటీని లెక్క చేయ కుండా దుండగులు క్యాం పస్‌లోకి వచ్చారని వారంతా రిమ్స్ డైరెక్టర్ అభిమానులని ఆరోపి స్తున్నారు.అయితే ఎలాంటి అవాం ఛనీయ పరిస్థితులు తలెత్త కుండా పోలీసులు భారీగా బలగాలను మోహరించారు రిమ్స్‌లోకి చొరబడ్డ వ్యక్తు లను పోలీసులు అదు పులోకి తీసుకొని విచారి స్తున్నట్లు సమాచారం.