రంగారెడ్డి జిల్లాలో వ్యక్తి దారుణ హత్య

రంగారెడ్డి జిల్లాలో వ్యక్తి దారుణ హత్య?

రంగారెడ్డి జిల్లా:సెప్టెంబర్ 24 :
రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వ్యవసాయ వర్సిటీ సమీపంలో బెంగుళూరు జాతీయ రహదారి సర్వీస్ రోడ్డులో మృతదేహం కనిపించడం తో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గుర్తు తెలియని మృత దేహం రక్తం మడుగులో పడి ఉంది. అతి కిరాత కంగా కత్తితో గొంతుకోసి హత్య చేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. ఎక్కడో హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడ పడేసినట్లుగా పోలీసుల అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించా రు.

క్లూస్ టీ సాయంతో ఆధారాల సేకరిస్తున్నారు. వరుస హత్యాలతో స్థానికులు బెంబేలెత్తుతు న్నారు.అసలు హత్యకు గురైన వ్యక్తి ఎవరు? ఎందుకోసం హత్య చేశారు? హత్య చేసి ఇక్కడి వరకు తీసుకురావ లసిన అవసరం ఏంటి? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
కేసును చేదించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు నగరంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న వరుస హత్యలతో ప్రజలు భయాం దోళనకు గురవుతున్నారు. కాగా గత కొన్ని రోజుల క్రితం నగరంలో మహిళల మృతదేహాలు కలకలం రేపిన సంగతి పాఠకులకు తెలిసింది.

You may also like...

Translate »