చెవెళ్ల, 17 మార్చి 2025: మన్నెగూడ వైపు నుండి చెవెళ్లకు వస్తున్న బైక్ (TS06ER8085) ను లారీ (AP07TT9619) వెనక నుండి ఢీకొట్టిన ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న మాగిర్థి సాయి (25), చెవెళ్ల గ్రామానికి చెందిన యువకుడు, అక్కడికక్కడే మృతి చెందాడు.ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, లారీ డ్రైవర్ అతివేగంగా రావడంతో బైక్ను వెనక నుండి బలంగా ఢీకొట్టాడు. దీంతో సాయి కిందపడగా, లారీ అతనిపై నుంచి వెళ్లడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.ఈ ఘటనపై చెవెళ్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.