పేదల స్వప్నాలకు శక్తినిచ్చిన నాయకత్వం – ఇందిరమ్మ ఇండ్లతో భీమ్ భరత్ ముందడుగు

పేదల స్వప్నాలకు శక్తినిచ్చిన నాయకత్వం – ఇందిరమ్మ ఇండ్లతో భీమ్ భరత్ ముందడుగు


జ్ఞానతెలంగాణ,చేవెళ్ల:
చేవెళ్ల నియోజకవర్గం శంకర్‌పల్లి మండల పరిధిలోని దోబీపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి పామేన భీమ్ భరత్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా భీమ్ భరత్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ పేదల పక్షానే నిలుస్తుందని స్పష్టం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కేవలం మాటలకే పరిమితం చేయకుండా అమలు చేయడం కాంగ్రెస్ విధానమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు జరుగుతోందని వెల్లడించారు. పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, వారికి స్థిర నివాస భద్రత కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన వివరించారు.
ఇందిరమ్మ రాజ్యంలోనే పేదల కలలకు ఆకారం లభించిందని, సొంత ఇంటి కోసం సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న కుటుంబాలకు ఇది కొత్త ఆరంభమని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, పేదల అభ్యున్నతి అనే లక్ష్యాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ రవీందర్ రెడ్డి, సుశీల శంకర్, సర్పంచ్ రాఘవేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ అంతారం శ్రీనివాస్, వార్డ్ సభ్యులు కొనింటి శశికాంత్, ఎం రామ్ రెడ్డి, బి విట్టల్, రైమ్ పాషా, ఇసుఫ్, సేవాలాల్ అధ్యక్షులు నసీరోద్దీన్, పెంటా రెడ్డి, పలుగుట్ట నర్సింలు, లక్ష్మారెడ్డి, మాజీ ఎంపిటిసి అజాజ్, కౌన్సిలర్ సమీ, సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి, శివ యాదవ్ భరత్, వెంకటయ్య, కావలి గోపాల్, సాయి రాజశేఖర్ రెడ్డి, రఘపతి రెడ్డి, షేక్ రహీమ్, రాంరెడ్డి, సాయి, శంకర్, లక్ష్మారెడ్డి, నర్సింలు, యూసఫ్, వెంకటరెడ్డి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

You may also like...

Translate »