కన్నుల పండుగ గా లక్ష్మీవేంకటేశ్వర స్వామి దోపోత్సవం

కన్నుల పండుగ గా లక్ష్మీవేంకటేశ్వరస్వామి దోపోత్సవం
- దోపోత్సవం శ్రీవారు అశ్వవాహన వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు
- అశేష భక్త జనవాహిని మధ్యలో శ్రీవారి ధోపోత్సవం…-
- అధిక సంఖ్యలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దర్శించుకున్న భక్తులు
జ్ఞాన తెలంగాణ,చేవెళ్ల :
చేవెళ్ల మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి మహాశివరాత్రి జాతర భాగంగా కన్నుల పండుగగా దోపోత్సవం నిర్వహించారు.శనివారం రాత్రి 10 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు దోపోత్సవాన్ని కొనసాగింది.
శ్రీవారి దేవాలయ నుండి స్వామి వారి పుష్కరిణి వరకు ఊరేగింపుగా డప్పు వాయిద్యాల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. అలివేలు మంగమ్మను సైతం పుష్కరిణి వరకు తీసుకొచ్చారు. అనంతరం చెంచు వారి ఆటపాటల మధ్య స్వామి ఆభరణాలు దోచుకున్నారు. దోపోత్సవాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దోపోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటుచేసుకోకుండా సీఐ లక్ష్మారెడ్డి నేతృత్వంలో, సిబ్బందితో బందోబస్తు ఏర్పాటుచేశారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలుమహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా చేవెళ్ల లక్ష్మీ వేంకటేశ్వర స్వామి పుష్కరిణి వద్ద ఆధ్యాత్మికవేత గొల్లపల్లి అంజిరెడ్డి ధార్మిక ప్రవచనం వారి బృందం ఆధ్వర్యంలో సాంస్కృతిక, కీర్తనలు, భజనలు ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో… ఈవో నరేందర్, ఆలయ అర్చకులు, భక్తులు, మరియు వివిధ పార్టీల నాయకులు, వివిధ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధిక సంఖ్యలో తరలివచ్చారు.