జనవరి 17న కార్మిక మహాసభను విజయవంతం చేయాలి

ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి జైపాల్ రెడ్డి



జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, డిసెంబర్ 29 : జనవరి 17న కార్మిక మహాసభలు విజయవంతం చేయాలని ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి జైపాల్ రెడ్డి అన్నారు.తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) రాష్ట్ర కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి ఆదివారం ఉదయం 5 గంటలకు ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలోకార్మికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అదిలాబాద్ జిల్లా మున్సిపల్ యూనియన్ మహాసభ 2025 జనవరి 17న కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని మహాసభను జయప్రదం చేయాలని పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాంతారావు, జిల్లా నాయకులు నారాయణరెడ్డి, చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »