జ్ఞానతెలంగాణ,హైదరాబాద్: కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ లీగల్ నోటీసు పంపారు.ఫోన్ ట్యాపింగ్ కేసులో అసత్యాలు మాట్లాడారని అందులో పేర్కొన్నారు. కేంద్ర మంత్రిగా ఉండి బాధ్యతారహితంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఒక ప్రజాప్రతినిధిపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రాజకీయ ఉనికి కోసమే అసత్య ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. తనకు వెంటనే క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. భవిష్యత్‌లోనూ అసత్య ఆరోపణలు చేయకుండా ఉండాలన్నారు. లేదంటే క్రిమినల్ చర్యలకు బండి సంజయ్ బాధ్యులు అవుతారని హెచ్చరించారు.ఇటీవల ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరైన అనంతరం బండి సంజయ్..కేటీఆర్‌పై పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.