సరూర్నగర్ స్టేడియంలో 24న కబడ్డీ ట్రయల్స్ – మీ స్కిల్‌కు వేదిక సిద్ధం

  • డిసెంబర్ 11–14: కరీంనగర్‌లో అంతర్ జిల్లా పోటీలు
  • పురుషులకు 85kg, మహిళలకు 75kg లోపు బరువు అర్హత

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 24-11-2025 సోమవారం సాయంత్రం 3 గంటలకు సరూర్నగర్ ఇండోర్ స్టేడియం కబడ్డీ గ్రౌండ్‌లో మహిళలు, పురుషుల జిల్లా జట్ల ఎంపికకు సెలెక్షన్స్ జరగనున్నట్లు జిల్లా అధ్యక్షుడు ఎం. రవి కుమార్, ప్రధాన కార్యదర్శి పి. సుధాకర్ రెడ్డి తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు డిసెంబర్ 11 నుండి 14 వరకు కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో జరిగే అంతర్ జిల్లా కబడ్డీ పోటీల్లో రంగారెడ్డి జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.

పురుషుల విభాగంలో 85 కిలోల లోపు, మహిళల విభాగంలో 75 కిలోల లోపు బరువున్న వారు మాత్రమే ఎంపిక పోటీలకు అర్హులు. ట్రయల్స్‌కు హాజరయ్యే ఆటగాళ్లు తమ ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని అధికారులు సూచించారు. మరిన్ని వివరాల కోసం J. చంద్రమోహన్ – 7661992581, ఈ రాజు – 9000038272 నెంబర్లను సంప్రదించాలని ప్రధాన కార్యదర్శి పి. సుధాకర్ రెడ్డి తెలిపారు.

You may also like...

Translate »