రావులపల్లిలో కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరికలు

జ్ఞానతెలంగాణ, చేవెళ్ల, అక్టోబర్ 29 : చేవెళ్ల నియోజకవర్గంలోని రావులపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్‌ఎస్ నాయకులు, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ పి. కృష్ణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పి. ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్‌కు చెందిన పలువురు ముఖ్య నాయకులు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముడిమ్యాల పిఎసిఎస్ డైరెక్టర్ కేసారం నరేందర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కటికే నర్సింగ్ రావు, కె. మధు, లక్ష్మన్ కుమార్, బూర్ల మల్లేష్ తదితరులు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్‌ఎస్ కండువా కప్పుకున్నారు.ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, ప్రజల అభివృద్ధి కోసం కృషి చేసే పార్టీగా బీఆర్‌ఎస్ నిలిచిందని, రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీఆర్‌ఎస్ యువజన అధ్యక్షుడు వంగ శ్రీధర్ రెడ్డి, సీనియర్ నాయకులు గోనె కరుణాకర్ రెడ్డి, శేరి రాజు, పిఎసిఎస్ డైరెక్టర్ మాధవరెడ్డి, ముడిమ్యాల మాజీ సర్పంచ్ శేరి స్వర్ణలత దర్శన్, మాజీ ఉప సర్పంచులు శేరి శ్రీనివాస్, గోనే మాధవ్ రెడ్డి, నాయకులు బి. శ్రీనివాస్, మధుసూదన్ గౌడ్, కె. రాము, బి. శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
