జన్వాడ గ్రామం అష్టదిగ్బంధనం

జన్వాడ గ్రామం అష్టదిగ్బంధనం

పోలీసుల పహారాలో గ్రామ ప్రజలు.శంకర్‌పల్లి: (జ్ఞాన తెలంగాణ) మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలోని జన్వాడ గ్రామంలో గత రెండు రోజుల క్రితం మెథడిస్ట్ చర్చిపై దాడి జరిగి,పలువురికి తీవ్ర గాయాలు కావడంతో, వారిని గాంధీ హాస్పిటల్ కు తరలించిన సంఘటన తెలిసిందే. గురువారం రాజేంద్రనగర్ డిసిపి శ్రీనివాస్, అడిషనల్ డీసీపీ రేష్మ పెరిమాళ్,ఏసిపి లక్ష్మీనారాయణ, శంకర్ పల్లి సిఐ వినాయక్ రెడ్డి, మోకిలా సీఐ వీరబాబు, నార్సింగి సీఐ కృష్ణారెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి,ఇచ్చిన నివేదిక మేరకు, సైబరాబాద్ కమిషనర్ ఆదేశాలతో జన్వాడ గ్రామంలో 144 సెక్షన్ విధించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, సుమారు 200 మంది పోలీసు బలగాలతో పహారా కాస్తున్నారు.

You may also like...

Translate »