ఉచితం సరే…. పల్లెలకు బస్సులేవి.

ఉచితం సరే…. పల్లెలకు బస్సులేవి.

కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే మహాలక్ష్మి పథకం ప్రారంభమైంది,*తొగుట మండలం నుండి మహిళలు వివిధ ప్రాంతాలకు వెళుతూ ఉంటారు కానీ మన మండలానికి ఒక బస్సు కూడా లేదు కాబట్టి ఇప్పటికైనా మండల నాయకులు బస్సు సౌకర్యాల మీద స్పందించి వెంటనే ఆర్టీసీ అధికారులతో సంప్రదింపులు జరిపి బస్సులు నడిపే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నాము,మహిళలు, విద్యార్థినులు, చిరు ఉద్యోగులు, ప్రైవేట్ సంస్థలో పనిచేసే కూలీలు, ఆస్పత్రులకు ఇతర పనులకు వెళ్లేవారు ఇలా పెద్ద సంఖ్యలో మహిళలు రోజు వారిప్రయాణం చేస్తుంటారు కాబట్టి వీరందరికీ ప్రైవేట్ వాహనాలే దిక్కు అవుతున్నాయి, ప్రైవేట్ వాహనాలపై ఆధారపడితే, ఆర్టిసి కంటే మూడింతలు ఎక్కువగా చార్జీలు వసూలు చేస్తున్నారు,కావున మన సిద్దిపేట జిల్లా నుండి గజ్వేల్ వరకు రెండు బస్సులు వేయాల్సిందిగా అధికారులను కోరుతున్నాము…

You may also like...

Translate »