హమాలీ కూలిపనులను అడ్డుకోవడం మానవత్వం కాదు

హమాలీ కూలిపనులను అడ్డుకోవడం మానవత్వం కాదు


  • రెక్కాడితే గాని డొక్కాడని బ్రతుకులు మావి
  • అర్హత లేని వారికి పని కల్పించాలని
  • కాంట్రాక్టర్ పై ఒత్తిడి చేస్తున్న సీఐటీయూ అధ్యక్షుడు యర్రా శ్రీకాంత్

జ్ఞాన తెలంగాణ ఖమ్మం జిల్లా ప్రతినిధి : ఎర్ర శ్రీకాంత్ పై చర్యలు తీసుకోవాలి విలేకరుల సమావేశంలో ఎఫ్.సి.ఐ గోడాం హమాలీల ఆవేదన ఖమ్మం నగరంలోని ఎఫ్.సి.ఐ గోదాంలో గత 15 సంవత్సరాలుగా హమాలీ కూలీలుగా పనిచేస్తున్నామని, మాకు పని దొరకకుండా సి.ఐ.టి.యు నాయకులు అడ్డుకుంటున్నారని ఇది మానవత్వం కాదని రెక్కాడితే గాని డొక్కాడని బ్రతుకులు మావి హమాలీల మధ్య గొడవలు సృష్టించి అన్యాయం చేస్తున్నారని ఎఫ్.సి.ఐ గోడం హమాలీలు ఆవేదనను వ్యక్తం చేశారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఖమ్మంలోని ఎప్.సి.ఐ లో కాంట్రాక్టు కూలీలుగా గత 15 సంవత్సరాలుగా పనిచేయుచున్నామన్నారు. ఐ.ఎన్.టి.యు.సి ట్రేడ్ యూనియన్ లో అనుబంధంగా ఉంటున్నామన్నారు సదరు కాంట్రాక్టర్ అందరితో పాటు మాకు కూడా పనులు కల్పిస్తున్నాడని అక్కసుతో అతనిపై కక్ష కట్టి సి.ఐ.టి.యు జిల్లా అధ్యక్షుడు యర్రా శ్రీకాంత్ అర్హతలేని 30మందిని పనిలోకి తీసుకోవాలని అతనిపై ఒత్తిడి చేస్తున్నాడని ఆరోపించారు అదేవిధంగా పనిచేస్తున్న మాకు దిగుమతులు జరగకుండా ఐ.ఎన్.టి.యు.సి, సి.ఐ.టి.యు ల మధ్య గొడవలు సృష్టిస్తూ లారీలను వేరే గోడానికి మళ్ళిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పనికి ఆటంకం కలిగించే విధంగా నిత్యం టెంటు వేసి ధర్నాలు చేసి కాంట్రాక్టర్ ను పనిచేయకుండా అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బయట ఎక్కడా లేని రేట్లు ఒప్పుకోమని ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఈ విషయంలో ఐ.ఎన్.టి.యు.సి జిల్లా అధ్యక్షులు కొత్త సీతారాములు, నగర అధ్యక్షులు నరాల నరేష్, సి.ఐ.టి.యు జిల్లా అధ్యక్షులు యర్రా శ్రీకాంత్ ఆధ్వర్యంలో సమావేశం జరిగి తీర్మానం చేసుకున్నప్పటికీ దానికి కట్టుబడి ఉండకుండా బయటికు వచ్చి కాంట్రాక్టర్ హమాలీలు కూలీల మధ్య విభేదాలు సృష్టించి మాకు అన్యాయం చేస్తున్న యర్రా శ్రీకాంత్ పై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వారు వేడుకున్నారు ఈ విలేకరుల సమావేశంలో ఎల్ది సురేష్ రంజిత్ వీరబాబు వీరేష్ ఏడుకొండలు మురళీకృష్ణ కాంట్రాక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు

Balraj,Kammam

You may also like...

Translate »