దళితుల రక్షణ అంటే ఇదేనా..?

  • షాద్ నగర్ ఎమ్మెల్యేకు బాధితులను పరామర్శించడానికి సమయం లేదా..?
  • రంగారెడ్డి జిల్లా సిపిఎం కార్యదర్శి పగడాల యాదయ్య
  • షాద్ నగర్ లో సిపిఎం, ఎస్ఎఫ్ఐల ఆందోళన
  • పోలీసులపై “ఎఫ్ఐఆర్” నమోదు చేయాలి
  • మొయినాబాద్, షాద్ నగర్ ఎస్సైలు తదితరులపై అట్రాసిటీ కేసు పెట్టాలి
  • ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసును వెంటనే విచారించాలి
  • రాజశేఖర్ హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి
  • ఎల్లంపల్లి గ్రామాన్ని కలెక్టర్, పోలీస్ కమిషనర్ వెంటనే సందర్శించాలి
  • మృతుడి భార్యకు రూ. 50 లక్షల ఎక్స్గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి

దళితుల సంక్షేమం అభివృద్ధి రక్షణ అని చెబుతున్న ప్రభుత్వం వాటి అమలు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని దీనికి ఎల్లంపల్లి గ్రామ దళితుడు ఎర్ర రాజశేఖర్ కుల దురహంకార హత్యకు బలైన సంఘటనే ఒక నిదర్శనమని సిపిఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య విమర్శించారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ చౌరస్తాలో స్థానిక సిపిఎం పార్టీ నాయకులు ఎన్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా షాద్ నగర్ చౌరస్తాపై ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాజశేఖర్ హత్యకు సంబంధమున్న అదేవిధంగా నిర్లక్ష్యం వహించిన పోలీసులపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ భవిత కుటుంబాన్ని సందర్శించి ప్రభుత్వం తరఫున భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని ఇంత పెద్ద సంఘటన జరిగినాక కూడా ఎమ్మెల్యే శంకర్ కు బాధితులను పట్టించుకునే సమయం లేకపోవడం బాధాకరమని జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య ప్రధానంగా విమర్శించారు. ఎక్కడో దూరాన బస్సులో ప్రయాణికులు సజీవ దహనం అయితే వెంటనే స్పందించిన ఎమ్మెల్యే శంకర్ తన నియోజకవర్గంలోని ఇంత పెద్ద సంఘటన జరిగితే స్పందించకపోవడం బాధాకరమని పగడాల యాదయ్య ఆవేదన చెందారు. సిపిఎం ఆందోళనను ఉద్దేశించి పగడాల యాదయ్య మీడియాతో మాట్లాడుతూ.. రాజశేఖర్ ను ఇన్నోవా వాహనంలోనే చిత్రహింసల గురిచేసి చంపి ఆ తర్వాత ఇతర ప్రాంతంలో దహనం చేయడం జరిగిందని మృతుడి భార్య పోలీసులకు 100 డయల్ చేసి ఫిర్యాదు చేసిందని ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో దీనిపై అధికారులు విచారణ చేపట్టకుండా వదిలివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన సమయంలో వెంటనే పోలీసులు స్పందించి ఉంటే రాజశేఖర్ హత్యకు గురయ్యేవాడు కాదని పేర్కొన్నారు. ముఖ్యంగా మృతుడి సోదరుడు చంద్రశేఖర్ భవాని ప్రేమ వ్యవహారంలో తలదుర్చిన షాద్ నగర్ ఎస్సై శ్రీకాంత్ మరో సిబ్బంది, అదేవిధంగా మొయినాబాద్ ఎస్సై తదితరులు రాజశేఖర్ పట్ల దురుసుగా వ్యవహరించారని అతని వేదించారని తమ విచారణలో తెలిసిందని వీరిపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి అట్రాసిటీ కేసు కట్టాలని డిమాండ్ చేశారు. ఎల్లంపల్లి గ్రామాన్ని పోలీసు కమిషనర్ వెంటనే సందర్శించాలని అదేవిధంగా జిల్లా కలెక్టర్ సైతం గ్రామాన్ని సందర్శించి దళితులకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మృతుని కుటుంబంలో భార్యకు ఒక ప్రభుత్వ ఉద్యోగం ఆ కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని అదేవిధంగా అందరిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి సత్వర విచారణ జరపాలని పగడాల యాదయ్య డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో సిపిఎం పార్టీ ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని న్యాయపోరాటం పెద్ద ఎత్తున చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వం దిగిరాకపోతే రాష్ట్రవ్యాప్తంగా కుల దురహంకార హత్య విషయంలో భారీ పోరాటాలను మలుచుతామని తెలిపారు.

కులాంతర, మతాంతర వివాహాలు చేసుకునే ప్రేమికులకు రక్షణ కల్పించాలి

కులాంతర మతంత్ర వివాహాలు చేసుకునే ప్రేమికులకు సంఘంలో సమాజంలో ప్రభుత్వాలు రక్షణ కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని సిపిఎం స్థానిక డివిజన్ నాయకుడు ఎన్ రాజు డిమాండ్ చేశారు. సిపిఎం ఆందోళన సందర్భంగా ఆయన ప్రభుత్వ వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దళితుడు ఎర్ర రాజశేఖర్ ను అత్యంత క్రూరంగా హత్య చేసిన సంఘటనలో పోలీసుల పాత్ర పై సత్వర న్యాయవిచరణ జరపాలని డిమాండ్ చేశారు. మొయినాబాద్ అదేవిధంగా షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో బాధితుల పట్ల ఎస్ఐలు వ్యవహరించిన తీరు అదే విధంగా ప్రేమించిన యువతీ భవాని బంధువు, శ్రీరాములు బాధితులపై తీసుకువచ్చిన పోలీసు ఒత్తిడి తదితర అంశాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని వారి పేర్లను అట్రాసిటీ సెక్షన్ ఎఫ్ఐఆర్ లో నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చాక 142 కుల దృహంకార హత్యలు జరిగాయని ఇవి ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. సమాజంలో మేజర్ గా ఉన్న ప్రేమికులకు రాజ్యాంగం పరంగా వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ప్రభుత్వంపై ఉందన్నారు. అదేవిధంగా సిఐటియు నాయకులు బీసా సాయిబాబు మాట్లాడుతూ ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపకపోతే పెద్ద ఎత్తున డివిజన్ వ్యాప్తంగా భారీ ఆందోళన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు. ఇంకా సిపిఎం నాయకులు శ్రీను నాయక్, ఈశ్వర్ నాయక్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

You may also like...

Translate »