భారతదేశ ఉక్కు మహిళ ఇందిరాగాంధీ

_ సంక్షేమం,అభివృద్ధికి మారుపేరు ఇందిర పాలన..
_ ఇందిరా గాంధీ స్ఫూర్తితో తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన..
_ నీలం మధు ముదిరాజ్..
పటాన్ చెరు, నవంబర్ 19 (జ్ఞాన తెలంగాణ):
తన పరిపాలన దక్షతతో భారత దేశ ఉక్కుమహిళగా పేరుగాంచిన వీరవనిత మాజీ ప్రధాని భారతరత్న ఇందిరాగాంధీ అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు.బుధవారం ఇందిరాగాంధీ జయంతి పురస్కరించుకొని చిట్కూల్ లోని ఆయన నివాసం వద్ద, పేదలకు ఆమె అందించిన సంక్షేమాని స్మరించుకుంటూ ఆమె చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ పేదలకు సంక్షేమం, అభివృద్ధిని దగ్గరికి చేసి భారతీయుల గుండెలో పదిలంగా నిలిచిపోయారని తెలిపారు. ఆనాడు ఆ మహానేత ముందు చూపుతో చేపట్టిన సంక్షేమ పథకాల ఫలితంగా దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. ఇందిరమ్మ పాలన స్ఫూర్తితో తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పాలన కొనసాగిస్తూ అన్ని వర్గాలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని అందిస్తుందని వివరించారు.
