శంకర్పల్లిలో 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శంకర్పల్లి పురపాలక సంఘం పరిధిలో గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించబడింది. ఉదయం 10:30 గంటలకు శంకర్పల్లి పట్టణంలోని 13వ వార్డులో వేముల విజయ ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం శాసనసభ్యుడు కాలే యాదయ్య చేతుల మీదుగా జరిగింది.
ఇప్పటివరకు మొత్తం 18 ఇళ్లను ప్రారంభించడం జరిగింది. పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలితాలను ఇస్తున్నాయని అధికారులు తెలిపారు.
కార్యక్రమంలో చైర్పర్సన్ సాత ప్రవీణ్ కుమార్, వైస్ చైర్పర్సన్ జూలకంటి శ్వేత, కౌన్సిల్ సభ్యులు, మున్సిపల్ కమిషనర్ యోగేష్, మున్సిపల్ మేనేజర్ అంజన్ కుమార్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.





