అంబేద్కర్ ఉద్యమ స్పూర్తితో హక్కులకై ఐక్యంగా ఉద్యమిద్దాం భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం

అంబేద్కర్ ఉద్యమ స్పూర్తితో హక్కులకై ఐక్యంగా ఉద్యమిద్దాం భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం

  • వరంగల్ డిక్లరేషన్ ను అమలు చేయాలి
  • డిబిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రౌతు రమేష్ కుమార్

జ్ఞాన తెలంగాణ వరంగల్ డిసెంబర్ 29:

భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ ఉద్యమ స్పూర్తితో మన మంత హక్కులకై ఐక్యంగా ఉద్యమించాలని,బావి భారత రాజ్యాంగాన్ని రక్షించుకునే బాధ్యత మనపై ఉందని,రాష్ట్ర ప్రభుత్వంకాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ ను పకడ్బందీగా అమలు చేసి,భూమిలేని ఉపాధి హమీ,రైతు కూలీలకు ఏడాదికి 12 వేల రూపాయాల ఆర్ధిక సహయం అందజేసే పథకాన్ని ప్రవేశపెట్టి విధి విధానాలను వెంటనే రూపొందించి అమలు చేయాలని డిబిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రౌతు రమేష్ కుమార్,ఉపాధ్యక్షులు చుంచు రాజేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శనివారం నాడు హసన్‌పర్తి మండల కేంద్రములో నవంబర్ 26 నుండి జనవరి 26 వరకు భారత రాజ్యాంగ హక్కుల విలువల పరిరక్షణ ఉద్యమంలో భాగంగా డిబిఎఫ్ మండల సదస్సు నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా రౌతు రమేష్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు చుంచు రాజేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల హామీలో భాగంగా ప్రకటించిన వరంగల్ రైతు డిక్లరేషన్ లో భూమి లేని ఉపాధి హామీ రైతు కూలీలకు ఏడాదికి 12 వేల రూపాయలు ఆర్ధిక సహయం అందజెస్తామని హామీ ఇచ్చారని,మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాపాలన కూలీల ఆర్ధిక సహయానికి దరఖాస్తులను స్వీకరించారని,రాష్ట్ర బడ్హెట్ లో 1200 కొట్లను సైతం కేటాయించారు.ఇటివల డిప్యూటీ CM,రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి కూలీల ఆర్ధిక సహయ పథకాన్ని డిసెంబరు 28 (నేటి) నుండి అమలు చేస్తామని వేర్వేరు గా ప్రకటించారు. ఈ ఫధకం అమలు కు నేటికి మార్గదర్శకాలను విడుదల చేయలేదు.కాని పత్రికలలో వివిధ కథనాల ప్రకారం భూమి లేని వారికి,ఉపాధి హామీలో వంద రోజులు పూర్తి చేసిన కూలీలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తున్నది ప్రచారం జరుగుతుంది.కాని గత పదేళ్ళుగా బిజెపి అధ్వర్యంలో ని కేంద్ర ప్రభుత్వం నిధులను తగ్గించడం,ఆన్ లైన్ హజరు NMMS,అధార్ బెసెడ్ పెమెంట్ పేరుతో ఉపాధి పథకాన్ని ఎత్తివేయాడానికి చెస్తున్న కుట్రలో బాగంగా కూలీలకు సక్రమంగా పనులు కల్పించడం లేదు.చేసిన పనికి సకాలంలో వేతనాలు అందడం లేదు.కనీస వేతనం చెల్లించకపొవడంతో ఉపాధి హామీ కూలీలు ఉపాధి హమి పని పట్ల విముఖత చూపించాల్సిన పరిస్థితి కి నెట్టబడ్డారు.వందరోజుల పని లక్షాలాది కుటుంబాలకు అందలేదు. కేంద్ర ప్రభుత్వ Mgnregs వెబ్ సైట్ ప్రకారమే 2023-24 ఆర్ధిక సంవత్సరంలో కేవలం 1,34,963 లక్షల కుటుంబాల కు,2024-25 ఆర్ధిక సంవత్సరంలో కేవలం 30,380(26-12-2024 నాటికి) వేల కుటుంబాలకు మాత్రమే 100 రోజుల పని దినాలు కల్పించారు.కనుక వందరోజుల ప్రతిపాదికన ఆర్ధిక సహయం అందజెస్తే లక్షలాది మంది కూలీలు నష్టపొతారు. ఈ నేపధ్యంలో దళిత బహుజన ఫ్రంట్ నిర్దిష్ట ప్రతిపాదనలను మీ ముందు వుంచుతున్నామన్నారు.డిబిఎఫ్ ప్రతిపాదనలు1). భూమిలేని మరియు ఒక ఎకరం లోపు భూమి వున్న కుటుంబాలకు ఈ పథకానికి ఎంపిక చేయాలి. 2). ఉపాధి హామీ పథకం లో వంద రోజులు పూర్తి చెసిన వారికి పరిమితం చేయకుండా రాష్ట్రంలో 53 లక్షల ఉపాధి హామీ జాబ్ కార్డులో పెర్లు వున్న 1.10 కోట్ల కూలీలకు అమలు చెయాలి.3) విడతలో వారిగా కాకుండా ఒకేసారి 12 వేలు చెల్లించాలి. 4) పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఏడాదికి ఒకసారి 12 వేలు కాకుండా ప్రతి నెల 3 వేల రూపాయలు చెల్లించాలని కొరుతున్నాం.5) పట్టణ,మహిళ గృహ తదితర అసంఘటిత కార్మికుల కు ఈ పధకాన్ని వర్తింప చేయాలి.6) గ్రామిణ ఉపాధి హామీ కూలీలకు రైతుభీమా లాగా కూలీ భీమా పథకాన్ని అమలు చేయాలి. 7) ఒంటరి స్త్రీలకు,వికలాంగులకు ప్రధాన్యతనివ్వాలి. మండలంలోని గ్రామలలో ఉపాధి హామీ పనులను వెంటనే ప్రారంభించాలని యంపిడివో కార్యాలయంలోని యంపివో గారికి కూలీలతో కలిసి వినతి పత్రం అందజేయడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో డిబిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చుంచు రాజేందర్, రాష్ట్ర నాయకురాలు బొర్ర సంపూర్ణ, జిల్లా కార్యదర్శులు చుంచు నరేష్, మేకల అనిత,బౌతు రాధ,సీనియర్ నాయకులు పసుల దాసు,దోమ కొమరయ్య,చుంచు సదానందం,గాజుల రాజు,చుంచు సుందర్, ప్రశాంత్,అనిత,రజిత,మేనక,వసంతవిజయ,రేణ,చిలకమ్మ,సాంబయ్య,తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »