ఈనెల లబ్ధిదారులకు పాత పింఛన్లు అమలు.

ఈనెల లబ్ధిదారులకు పాత పింఛన్లు అమలు.
హైదరాబాద్ జనవరి 22: తెలంగాణ రాష్ట్రంలో ఈనెల ఆసరా పింఛన్లు ఇవ్వవలసి ఉంది దీనికోసం వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.గత ప్రభుత్వం పింఛను రూ.3,016 గా ఇచ్చింది అయితే కాంగ్రెస్ మాత్రం తాము అధికారంలోకి వస్తే సాధారణ పింఛను రూ.4,000 దివ్యాంగ పింఛనును రూ.6,000 చేస్తామని ప్రకటించింది ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో తమకు కొత్త పెన్షన్ వస్తుందని చాలా మంది భావిస్తున్నారు.
ఈ నెల నుంచి ప్రభుత్వం తమకు పెన్షన్ పెంపు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో ప్రస్తుతం 15,98,729 మంది వృద్ధులు 15,60,707 మంది వితంతువులు దివ్యాంగులు 5,03,613 మంది బీడీ కార్మికులు 4,24,585 మంది ఒంటరి మహిళలు 1,42,394, గీత కార్మికులు 65,307 చేనేత కార్మికులు 37,145 హెచ్ ఐవీ బాధితులు 35,998 ఇలా వివిధ వర్గాలవారు మొత్తం 43,96,667 మంది పింఛన్లు తీసుకుంటుంటున్నారు.
ఈ పెన్షన్ల అమలు కోసం ప్రతినెలా రూ,వెయ్యి కోట్లు ఖర్చవుతోంది అయితే ఈనెల మాత్రం పాత పద్దతిలోనే పెన్షన్లు ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఎప్పటి నుంచి నెరవేరుతుందనే స్పష్టత లేనందున పాత తరహాలోనే పింఛన్లను విడుదల చేయనున్నారు.విధివిదానాలు ఖరారు చేయనుందున పాతపెన్షన్లే ఇవ్వనున్నట్లు తెలిసింది ఆసరా పింఛన్లను ఈ నెలలో పాత పంథాలోనే విడుదల చేసేందుకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.