ఆత్మవిశ్వాసంతో చదివితే విజయం మీ సొంతం

ఆత్మవిశ్వాసంతో చదివితే విజయం మీ సొంతం


  • ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
  • 14 వేల మంది విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ
  • అత్యుత్తమ ఫలితాలు సాధించిన వారికి నగదు ప్రోత్సాహక బహుమతులు..
  • పటాన్ చెరు లో కేజీ నుంచి పీజీ వరకు ప్రభుత్వ విద్యాసంస్థల విస్తరణ
  • పారిశ్రామిక అభివృద్ధికి అనుగుణంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు
  • పరీక్షల ఒత్తిడిని దూరం చేయేందుకు వ్యక్తిత్వ ప్రేరణ తరగతులు నిర్వహణ

జ్ఞాన తెలంగాణ, రామచంద్రాపురం,ఫిబ్రవరి 28:
ఆత్మవిశ్వాసంతో చదివితే విజయం తప్పక సాధ్యమవుతుందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 10వ తరగతి విద్యార్థులకు సూచించారు. పరీక్షల సమయంలో ఒత్తిడికి లోనుకాకుండా ప్రణాళికాబద్ధంగా చదివి అత్యుత్తమ ఫలితాలు సాధించాలని విజ్ఞప్తి చేశారు.
రామచంద్రాపురం డివిజన్ పరిధిలో నిర్వహించిన వ్యక్తిత్వ ప్రేరణ తరగతులను ఆయన ముఖ్య అతిథిగా ప్రారంభించారు. తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని సుమారు 14 వేల మంది పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని పంపిణీ చేశారు. ప్రతి సంవత్సరం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులతో మోటివేషనల్ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
పదవ తరగతి పరీక్షలు విద్యార్థి జీవితంలో కీలకమైన దశ అని పేర్కొంటూ,ర్యాంకులు మాత్రమే లక్ష్యంగా కాకుండా నైతిక విలువలు, మానసిక ధైర్యం, శారీరక ధారుఢ్యం పెంపొందించుకోవాలని సూచించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు మండల స్థాయిలో ప్రతి ఏడాది సొంత నిధులతో నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నట్లు వెల్లడించారు.పేద,మధ్యతరగతి కుటుంబాలకు ఉన్నత విద్య భారంగా మారకూడదనే లక్ష్యంతో పటాన్చెరులో కేజీ నుంచి పీజీ వరకు ప్రభుత్వ విద్యాసంస్థలను అభివృద్ధి చేసినట్లు గుర్తు చేశారు. పారిశ్రామిక వాడగా పేరుగాంచిన ఈ ప్రాంతంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఆధునిక వసతులతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారులు,ప్రజాప్రతినిధులు,నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

You may also like...

Translate »