బైక్‌ను ఢీకొట్టి పొదల్లోకి దూసుకెళ్లిన ఐబిఎస్ విద్యార్థుల కారు

- శంకరపల్లి నుండి నర్సింగి వెళ్లే ప్రధాన రహదారిపై ప్రమాదం
జ్ఞాన తెలంగాణ,శంకరపల్లి ప్రతినిధి,నవంబర్ 06
గండిపేట్ మండలం ఖానాపూర్ నగర శివారులో వేగంగా వచ్చిన ఓ కారు అదుపు తప్పి బైక్‌ను ఢీకొట్టి, సమీపంలోని పొదల్లోకి దూసుకెళ్లింది,
ఈ ఘటనలో బైక్ పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారంశంకరపల్లి నుండి నార్సింగి వైపు వేగంగా వస్తున్న TG13A8875 నంబర్ గల కారు అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయింది,
అదే సమయంలో ఎదురుగా రోడ్ పక్కన ఆగి వున్న బైక్‌ను బలంగా ఢీకొట్టింది, ఆ ధాటికి బైక్ పై ఉన్న క్రింద పడిపోగా, కారు మరింత ముందుకు దూసుకెళ్లి, రోడ్డు పక్కన ఉన్న చెట్ల పొదల్లోకి పడిపోయింది,ప్రమాద తీవ్రతకు కారు ముందు వెనక భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది,
కారులో ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తున్న వారిలో ఒకరు అనిల్ డ్రైవింగ్ చేస్తూ మరొకరు ప్రమాదానికి గురై స్వల్ప గాయాలయ్యాయి ఒకరు సురక్షితంగా బయటపడినట్టు తెలుస్తోంది,
ఘటన జరిగిన సమయంలో కారు సురక్షితంగా ఉన్న వ్యక్తి చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి;-వేరే వాహనం మాకు సైడ్ మళ్లించి వెళ్లడం ద్వారా మా కారు బ్యాలెన్స్ అవుట్ అయ్యి రోడ్ పక్కన ఉన్న చెట్టుకి డికొట్టుని దాని ముందు ఆగి ఉన్న బైక్ పైకి దూకెళ్లడం జరిగింది అని చెప్పాడు,
బైక్ పై ఉన్న వ్యక్తి నగర శివారులో పనిచేస్తూ టోలిచౌకి నగరానికి చెందిన వ్యక్తి గా గుర్తించారు అతని స్థానికులు తక్షణమే ఆసుపత్రికి తరలించారు,అతనికి కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం
సమాచారం అందుకున్న నార్సింగి పోలీసు కానిస్టేబుల్స్ మల్లేష్ మరియు వెంకటేష్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు,ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.


