హైదరాబాద్ బీజాపూర్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం భార్యాభర్తలు మృతి

హైదరాబాద్ బీజాపూర్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం భార్యాభర్తలు మృతి
- కారును ఢీ కొట్టిన లారీ
- బంధువుల ఇంటికి వెళ్తుండగా ప్రమాదం
- మృతుల్లో ఇద్దరు భార్యాభర్తలు
- ప్రొద్దుటూరు గ్రామానికిచెందిన వారిగా గుర్తింపు
జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 01:
బీజపూర్ జాతీయ రహదారి మరోసారి రక్త సిక్తం అయింది.వివరలో కెలితే చేవెళ్ల మండలం,మీర్జాగూడ వద్ద కారు, లారీ డికొనడంతో, శంకర్ పల్లి మండలం ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన మేకల లక్ష్మారెడ్డి అతని భార్య,భాగ్యలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందారు ఘటన స్థలానికి పోలీసులుచేరుకొని మృతులు శంకర్ పల్లి మండలం ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన మేకల లక్ష్మారెడ్డి అతని భార్య,భాగ్యలక్ష్మి గా గుర్తించారు.ఆదివారం సెలవు కావడంతో చేవెళ్ల మండలం దేవరంపల్లి గ్రామంలో లోని తోడి అల్లుడు దగ్గరికి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న లారీ బలంగా డీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు అక్కడకక్కడే మృతి చెందారు. సంఘటన స్థలానికి వెంటనే పోలీసులు చేరుకొని దర్యాప్తు చేసి పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ఆసుపత్రికి తరలించారు. మృతుడు లక్ష్మారెడ్డి బీడీఏల్ లో విధులు నిర్వహిస్తున్నాడు.మృతి చెందిన భార్యాభర్తలకు ఇద్దరు కుమారులు ఒక కుమారులు, ఒకరు విదేశాల్లో చదువుకుంటున్నాడని.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునమాని చేవెళ్ల సిఐ భూపాల్ శ్రీధర్,ఎస్ ఐ శ్రీకాంత్ తెలిపారు.
