సింగరేణి కార్మికులకు భారీ బోనస్

సింగరేణి కార్మికులకు దసరా బోనస్ రూ. 1,95,610 ప్రతి కార్మికునికి దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు భారీ బోనస్ ప్రకటించింది. సంస్థ లాభాల్లో వాటాగా ప్రతి కార్మికునికి రూ. 1,95,610 చెల్లించనున్నట్లు ప్రకటించబడింది. ఈ నిర్ణయంతో సుమారు 71,000 మంది శాశ్వత మరియు కాంట్రాక్టు కార్మికులు ఈ బోనస్ ద్వారా లబ్ధి పొందనున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ మొత్తం రూ. 6,394 కోట్లు ఆదాయం పొందింది. ఖర్చులు అప్పగించిన తర్వాత నికర లాభం రూ. 2,360 కోట్లు వచ్చింది. ఈ లాభాల్లో 34 శాతం వాటా కార్మికుల బోనస్‌కు కేటాయించడం జరుగుతోంది. బోనస్ పంపిణీ కోసం మొత్తం రూ. 819 కోట్లు విడుదల చేయనున్నట్లు ఆయన వివరించారు. ఈ బోనస్ శాశ్వత ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు కార్మికులకూ వర్తిస్తుందని చెప్పారు.

భట్టి విక్రమార్క తెలిపారు, “సింగరేణి సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి ఆత్మలాంటిది. ఇది కేవలం బొగ్గు గని మాత్రమే కాదు, వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పించే ఉద్యోగ గని” అని. భవిష్యత్తులో సింగరేణి కేవలం బొగ్గు విభాగంలో కాకుండా, కీలక ఖనిజాల మైనింగ్ రంగంలో కూడా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. అంతేకాక, దసరా  బోనస్‌తో పాటు దీపావళి సందర్భంగా కూడా కార్మికులకు అదనపు బోనస్ అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

You may also like...

Translate »