తెలంగాణలో సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో నంది అవార్డుల పేరును గద్దర్ పేరు మీదగా ఇస్తామని కీలక ప్రకటన
సినీ కళాకారులకు అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుల్లో ఒకటైన నంది అవార్డుల విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.
కళారంగంలో ప్రముఖ ప్రజా కవి గద్దర్ చేసిన సేవలకు గుర్తింపుగా ఇకనుంచి తెలంగాణ రాష్ట్రంలో నంది అవార్డుల పేరును గద్దర్ పేరు మీదగా ఇస్తామని కీలక ప్రకటన చేశారు.హైదారాబాద్ లో రవీంద్ర భారతిలో గద్దర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేశారు. దీనిపై త్వరలోనే జీవో జారీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
