భూగర్భ జలాలను పిండి పడేస్తున్నారు

శంషాబాద్ లో వాల్టా నిబంధనలకు తూట్లు

విచ్చలవిడిగా బోర్లు పట్టించుకునే వారే లేరు

పురపాలక పరిధిలో రోడ్లపైనే బోర్లు వేయడం మరి దారుణం


జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, డిసెంబర్ 29: శంషాబాద్ లో వాల్టా చట్టాన్ని తుంగలో తొక్కి ఇ స్టారీతిగా బోర్లు వేస్తున్న పట్టించుకునే నాధుడే కరువయ్యారు. శంషాబాద్ దినదినాభివృద్ధి చెందుతున్న పట్టణం కావడంతో బహుళ అంతస్తుల నిర్మాణాలు తో వ్యాపార సంస్థలు పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతుండడంతో అదే రీతిలో బోర్లతోవ్వకాలు ఇష్టా రీతిన పెరిగిపోతున్నాయి. గతంలో పెద్ద ఎత్తున బోర్లు వేసి నీటిని తోడకాలు చేస్తున్నాడు అప్పట్లో భూగర్భ జలాల అడుగంటుతున్న నేపథ్యంలో అధికారులు బోర్లు వేయకుండా వాల్టా చట్టాన్ని తెరపై తీసుకొచ్చారు. ఈ వాల్ట చట్టం ప్రకారం నీటిని పొదుపుగా వాడుకోవడం అవసరానికి వాడుకోవడం తప్ప కమర్షియల్ గా నీటిని వాడుకోవడానికి వీల్లేదు. గతంలో ఆర్బి నగర్ మధురానగర్ లో వేసవిలో నీరు దొరకని పరిస్థితి ఏర్పడింది దీనికోసం 1400 నుంచి 1500 ఫీట్ల వరకు బోర్లు వేసి నీటిని తోడారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ గత అయిదారులుగా ఇష్టార్జిగా ఎక్కడపడితే అక్కడ బోర్లు వేస్తూ కాలనీలో రోడ్ల వెంటే వేయడం మరి దారుణం

పురపాలక పరిధిలో ఆర్మీ నగర్ మధుర నగర్ ప్రాంతాల్లో రోడ్ల వెంటే బోర్లు

పురపాలక పరిధిలోని గత రెండు మూడు ఏళ్లుగా ఇంటిలోనే వేసుకునేటువంటి బోర్లు ఇటీవల ఇంటి పక్కన రోడ్డు కానుకొని బోర్లు వేయడం స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బోర్లు గంటల తరబడి బోరు శబ్దాలు వాటి నుంచి వచ్చేటువంటి నీరుతో కాలినీలు మొత్తం బురదమయంగా మారుతున్నాయని స్థానికులు గతంలోని ఫిర్యాదులు చేశారు. బోర్లు వేసే సమయంలో దారులన్నీ పొగతో కమ్ముకొని మనుషులకు మనుషులు కనబడని రీతిగా పెద్ద ఎత్తున దుమ్ము దూళితో కాలనీలో కమ్మిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా బోరు నుంచి వచ్చే మొదటి బురద నీరు కాలిని మొత్తం ప్రవహించి వాహనాలు మనుషులు నడవలేని స్థితిలో రెండు మూడు రోజులు కాలనీలోనే బురదని నీరు ఉంటుందని కాలనీవాసులు ఆపోతున్నారు. పలు ప్రాంతాల్లో హిస్టారీతిగా ప్రధాన రహదారులపై సైతం రోడ్లమీద రెండు మూడు ఫీట్ల దూరంలోనే పెద్ద ఎత్తున బోర్లు వేసి హిస్టారీతిగా వ్యవహరిస్తుండడంతో అటు కాలనీవాసులు ఇటు స్థానికులు చూసి ఆశ్చర్యపోతున్నారు. అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు నుండి ఈ బోర్ల విషయంలో ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాల్టా చట్టం ఉన్నప్పటికీ కొన్ని నిబంధనలు ఉన్నప్పటికీ ఆ నిబంధనలు కూడా భేఖాతరు చేస్తూ ఎవరికి వారే యమునాతిరి అన్నట్టుగా ఎవరి ఇంటి ముందు వారు బయట వెళ్లే మార్గాల్లో రెండు మూడు ఫీట్ల దూరంలోనే బోర్లు వేయడం ఆందోళన కలిగించే విషయం. అసలే బోర్లు వేయడానికి వీలు లేదంటే రోడ్ల పక్కన పెద్ద ఎత్తున బోర్లు వేసి సమస్యలు సృష్టిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. గతంలో బోర్ల విషయంలో ఫిర్యాదు చేస్తే తాసిల్దారు బోర్లను సీజ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఇటీవల పెద్ద ఎత్తున బోర్లు వేస్తున్నప్పటికీ రాబోయే సమ్మర్ సీజన్ దృష్టిలో ఉంచుకొని కొందరు ముందుగానే బోర్లు వేస్తూ సమస్యలు సృష్టిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి ప్రధాన రహదారులపై బోరులు వేస్తూ దానికి సంబంధించిన వ్యర్ధాలను కాలనీల నిండా మురుగునీరు బోరు వేసిన సంబంధించిన వ్యర్ధాలను అలానే వదిలేస్తుండడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి హిస్టారీతిగా వేస్తున్న బోర్లపై దృష్టి సారించి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

You may also like...

Translate »