చెత్త బుట్టలోకి చేరిన గృహలక్ష్మి దరఖాస్తులు.

చెత్త బుట్టలోకి చేరిన గృహలక్ష్మి దరఖాస్తులు.
హైదరాబాద్ డిసెంబర్ 19:తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 15 లక్షల ‘గృహ లక్ష్మి’ దరఖాస్తులను రద్దు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం.గృహ నిర్మాణాల కోసం రూ .3 లక్షలు ఇచ్చేందుకు ఈ పథకాన్ని ఎన్నికల ముందు ప్రవేశపెట్టింది దీంతో ఈ పథకానికి దరఖాస్తుల వెల్లువెత్తాయి.
తాజాగా గృహలక్ష్మి పథకం కోసం బీఆర్ఎస్ హయాం లో సేకరించిన 15లక్షల పైచిలుకు దరఖాస్తుల్ని పరిగణించకూడద ని,కాంగ్రెస్ సర్కారు నిర్ణయించింది.వాటి స్థానంలో కొత్తవి తీసుకోవాలని భావిస్తోంది.
ఆ పథకానికి వచ్చిన మొత్తం పిటిషన్లలో 12 లక్షలు అర్హమైనవిగా అధికారులు గుర్తించారు అయితే వాటన్నింటిని ఇప్పుడు చెత్తబుట్టలో వేయనున్నారు.ప్రతి గ్రామంలోనూ గ్రామ సభలు నిర్వహించి అక్కడే దరఖాస్తులు స్వీకరించాలని కొత్త ప్రభుత్వం నిర్ణయింది త్వరలోనే గ్రామ సభల తేదీలను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నది.
