శంకర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా గోవిందమ్మ గోపాల్ రెడ్డి ఎన్నిక

వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా గోవిందమ్మ గోపాల్ రెడ్డి ఎన్నిక
జ్ఞాన తెలంగాణ,శంకర్పల్లి: శంకర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా గోవిందమ్మ గోపాల్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు రాజకీయ ప్రముఖులు, రైతు సంఘాల నేతలు శుభాకాంక్షలు తెలిపారు.
గోవిందమ్మ గోపాల్ రెడ్డి సుదీర్ఘ అనుభవం, ప్రజా సేవ పట్ల ఉన్న నిబద్ధత ఆమెను ఈ పదవికి అర్హురాలిగా నిలిపాయని నేతలు అభిప్రాయపడ్డారు. వ్యవసాయ మార్కెట్ కమిటీకి సంబంధించిన విధులు, రైతుల సమస్యలు, మార్కెట్ లో అవకాసాలను సమర్థంగా నిర్వర్తించే సామర్థ్యం గోవిందమ్మ గోపాల్ రెడ్డికి ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా గోవిందమ్మ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, “రైతుల సంక్షేమమే మా ప్రధాన లక్ష్యం. వారి పంటలకు సరైన ధర, సౌకర్యవంతమైన మార్కెట్ వ్యవస్థ అందించేందుకు కృషి చేస్తాను” అని హామీ ఇచ్చారు.
రైతుల హక్కులను కాపాడేందుకు, వ్యవసాయ మార్కెట్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు ఆమె చేపట్టే చర్యలు విజయవంతమవ్వాలని శంకర్పల్లి ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.




