వివాహితపై సామూహిక అత్యాచారం

  • ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన..
  • బాధితురాలు ఫిర్యాదు మేరకు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు..
  • కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి డిమాండ్ కు తరలింపు..

జ్ఞానతెలంగాణ,నిజామాబాద్:నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో వివాహితపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అత్యాచారానికి పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేయడంతో ఈ విషయం బహిర్గతమైంది. నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలానికి చెందిన వివాహిత(25) కు నిజామాబాద్ నగరంలోని ఆటో నగర్ కు చెందిన మోయిన్ ఇటీవల పరిచయమయ్యాడు. మోయిన్ సెంట్రింగ్ పనిచేసే క్రమంలో బిల్డింగ్ ఎదురుగ గల ఇంటికి చెందిన వివాహితతో పరిచయం పెంచుకుని ఆమెను, కుమారుడితో పాటు మాయమాటాలు చెప్పి నిజామాబాద్ రూరల్ మండలంలోని ఓ ఇంటికి తీసుకువెళ్లాడు. ఈ నెల 11న రాత్రి వివాహితకు, ఆమె కుమారుడికి తినే వాటిలో మత్తు పదార్థం ఇచ్చి సృహకోల్పోయేలా చేశాడు. అక్కడ మోయిన్ తో పాటు ఖయ్యూం, ఆమేర్ లు వివాహితపై అత్యాచారం చేశారు. గత కొన్ని రోజులుగా వివాహితపై ముగ్గురు పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ నెల 26న చివరి సారిగా ముప్కాల్ మండలంలోని ఓ ఇంటివద్ద వివాహితపై మోయిన్ అత్యాచారం చేశాడు. అక్కడి నుంచి ఈ నెల 27న నాగారం తీసుకువెళ్లి ముల్ సాబ్ ను కలిసి వస్తాను అని చెప్పి అక్కడ వదిలి పరారి అయ్యాడు. బాధితురాలు తనపై జరిగిన ఆఘాయిత్యంపై స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ లో సోమవారం ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేసి మోయిన్, ఖయ్యుం, అమేర్ లను అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్టు నిజామాబాద్ సౌత్ రూరల్ సీఐ సురేష్ తెలిపారు.

You may also like...

Translate »