స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఏకగ్రీవ ఎన్నిక

స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఏకగ్రీవ ఎన్నిక

తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.బుధవారం స్పీకర్‌ ఎన్నికకు నామినేషన్ల గడువు ముగిసింది.ఒకే నామినేషన్ రావడంతో ప్రసాద్‌కుమార్‌ ఎన్నిక ఏకగ్రీవమైంది.గురువారం నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.సభలో స్పీకర్‌ ఎన్నికపై ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రకటన చేయనున్నారు.

You may also like...

Translate »