ప్రజల సౌకర్యార్థం ఐదు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు..

ప్రజల సౌకర్యార్థం ఐదు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు..
- ప్రజల సురక్షిత ప్రయాణానికి ఎమ్మెల్యే జిఎంఆర్ చర్యలు
- అశోక్ నగర్, ఐటీఐ బీరంగూడ, రామచంద్రపురం రైల్వే లైన్, బస్టాండ్, సాకి చెరువు వద్ద ఎఫ్‌ఓబీలు
- లిఫ్ట్ సౌకర్యంతో ఆధునికంగా నిర్మాణం
- నిర్దేశించిన గడువులో పూర్తిచేయాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు
- నాణ్యతపై రాజీ లేకుండా పనులు చేయాలంటూ జిఎంఆర్ స్పష్టం
- జాతీయ రహదారి విస్తరణ పనులపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే జిఎంఆర్..
పటాన్ చెరు,నవంబర్ 18(జ్ఞాన తెలంగాణ) :
మదినగూడ నుండి సంగారెడ్డి వరకు చేపడుతున్న జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ప్రజల సౌకర్యార్థం పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని రామచంద్రపురం డివిజన్,పటాన్ చెరు డివిజన్లో పరిధిలో ఐదు ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టబోతున్నట్లు పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.సోమవారం సాయంత్రం జాతీయ రహదారణ సంస్థ, పోలీసు, ట్రాఫిక్ శాఖల అధికారులు, కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులతో కలిసి ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించబోయే స్థలాలలో ఎమ్మెల్యే జిఎంఆర్ క్షేత్రస్థాయి పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిహెచ్ఎల్ చౌరస్తా నుండి పటాన్ చెరు పట్టణంలోని సాకి చెరువు వరకు ప్రతిరోజు నిత్యం వేలాది మంది ప్రజలు వివిధ అవసరాల నిమిత్తం రహదారిని దాటుతూ ఉంటారని తెలిపారు.ఈ నేపథ్యంలో వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకుగాను ఐదు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించబోతున్నట్లు తెలిపారు.రామచంద్రపురం డివిజన్ పరిధిలోని అశోక్ నగర్,. బీరంగూడ ఐటిఐ,రామచంద్రపురం రైల్వే లైను, పటాన్చెరు బస్టాండ్, పటాన్ చెరు సాకి చెరువు సమీపంలో వీటిని నిర్మించబోతున్నట్లు తెలిపారు. విశాలమైన విస్తీర్ణంతో,లిఫ్ట్ సౌకర్యంతో వీటిని నిర్మించబోతున్నట్లు తెలిపారు. నిర్దేశించిన గడువులోగా రహదారి విస్తరణ పనులు పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.నిర్మాణాల నాణ్యత విషయంలో రాజీ పడవద్దని.. ప్రమాణాలకు అనుగుణంగా పనులు చేపట్టాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో జాతీయ రహదారుల సంస్థ డి ఈ రామకృష్ణ, డిఎస్పి ప్రభాకర్, సిఐలు వినాయక్ రెడ్డి, లాలు నాయక్, ఎక్సైసీఐ పరమేశ్వర్, నిర్మాణ సంస్థ ప్రతినిధులు శాస్త్రి, రమేష్, తదితరులు పాల్గొన్నారు.


