దిల్ సుఖ్ నగర్ డిపోలో అగ్ని ప్రమాదం.

దిల్ సుఖ్ నగర్ డిపోలో అగ్ని ప్రమాదం.

హైదరాబాద్ జనవరి 22: హైద‌రాబాద్‌లో రెండు ఆర్టీసీ బ‌స్సులు అగ్నికి అహుత‌య్యాయి దిల్‌సుఖ్‌ న‌గ‌ర్ ఆర్టీసీ డిపోలో ఇవాళ తెల్లవారు జామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.రెండు బస్సులకు నిప్పంటుకుని పూర్తిగా కాలిపోగా మరో బస్సు కూడా పాక్షికంగా దగ్ధమైందని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

ఒక్కసారిగా రెండు బస్సులకు నిప్పు అంటుకోవడంతో సిబ్బంది అలర్ట్ అయ్యారు బస్సులకు మంటలు అంటుకున్న నేపథ్యంలో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.ఇక సమయానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు అయితే అగ్ని ప్రమాదానికి కారణాలు లేంటనేది ఇప్పటి వరకు తెలియరాలేదు.ప్రమాద సమయంలో డిపోలో చాలా బస్సులు పార్కింగ్ చేసి ఉన్నాయి అయితే అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది అని డీపో అధికారులు తెలిపారు.

You may also like...

Translate »