బ్యాంకులు అందించే రుణాలపై రైతులకు అవగాహన కల్పించాలి

బ్యాంకులు అందించే రుణాలపై రైతులకు అవగాహన కల్పించాలి

  • దీర్ఘకాలిక స్వల్ప కాలిక రుణాలు రైతులు సద్వినియోగం చేసుకోవాలి
  • సెంట్రల్ బ్యాంక్ వారి నూతన సంవత్సర కాలమానిని ఆవిష్కరించిన
  • వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, డిసెంబర్ 29: బ్యాంకుల అందించే రుణాలపై రైతులకు అవగాహన కల్పించాలని అదేవిధంగా దీర్ఘకాలిక స్వల్పకాలిక రుణాలు రైతులు సద్వినియోగ చేసుకోవాలనీ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నూతన సంవత్సర కాలమానిని ఆయన పలువురు చైర్ పర్సన్ డైరెక్టర్ల సమక్షంలో ఆవిష్కరించారు. హైదరాబాదులోని ఆదివారంఅబిడ్స్, తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ ప్రధాన కార్యక్రమం లో ఎచ్ డి సి సి బి హైదరాబాద్ జిల్లా కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ వారి నూతన సంవత్సరం 2025 క్యాలెండర్ డైరీ నీ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వర్ రావు చేతుల మీదుగా ఆవిష్కరించారు.ఈ సందర్బంగా తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడుతూ రైతులకు సకాలం లో రుణాలు అందించాలి అని, అదేవిధంగా రైతులకు అందించే రుణాలపై బ్యాంకు వారు అవగాహన కార్యక్రమాలు కల్పించాలన్నారు. అదేవిధంగా రైతులకు దీర్ఘకాలిక స్వల్పకాలిక రుణాలు అందించాలని ఆయన అన్నారు. బ్యాంక్ వ్యవస్థ రుణాల పై అవగాహనా పెంచాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలోటి జి సి ఏ బి చైర్మన్ మార్నెని రవీందర్ రావు, టి జి సి ఏ బి వైస్ చైర్మన్, ఉమ్మడి రంగారెడ్డి డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య , టి జి సి ఏ బిఎండి గోపి (ఐ ఎ ఎస్), సీజీమ్ జ్యోతి, జిల్లా డీసీసీబీ చైర్మన్లు భోజరెడ్డి, దేవేందర్ రెడ్డి, నాగేశ్వర్ రావు, విషువర్ధన్ రెడ్డి, కుంట రెమెషరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి.ఎచ్ డి సి సి బి బ్యాంక్ డైరెక్టర్లు చెంద్రశేఖర్, మిగులయ్య, ఆనంద్, బాల్ రెడ్డి, బ్యాంక్ సీఈఓ భాస్కర్ సుబ్రహ్మణ్యం, జి ఏం లు ప్రభాకర్ రెడ్డి, ఫణి శ్రీరామ్ , బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »