లష్కర్ బోనాలకు..సర్వం సిద్ధం

- సోమవారం రంగం
- చివరి రోజున భారీ ర్యాలీ
- మూడు రోజులపాటు ఉత్సవం
- సిటీలో మద్యం షాపులు బంద్
- పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
- అదనపు బస్సులు నడుపనున్న ఆర్టీసీ
జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ ప్రతినిధి : ఆషాఢమాసంలో తెలంగాణ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది బోనాల జాతర. హైదరా బాద్లో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగు తున్నాయి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాలి అమ్మవారి బోనాల సంబురం చూడటాని కి రెండు కళ్లు సరిపోవు, బోనాల మరుసటి రోజు జరిగే రంగం కోసం కూడా జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత నుంచి ప్రభుత్వం బోనాలను అధికారికంగా నిర్వహిస్తోంది. కాగా, సికింద్రాబాద్ఉజ్జయినీ మహంకాళి జాతర రేపటి నుంచి ఈ నెల 15 వరకు ఘనంగా జరగనుంది. రగంను సోమవారం నిర్వ హించనున్నారు. వేలాదిమంది భక్తులు ఆలయానికి చేరుకో సుండగా.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు జారీ చేశారు. ఉజ్జయినీ మహంకాళి ఆలయం పరిసర ప్రాంతాల చుట్టూ రేపటి నుంచి 2 కి.మీ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ ఆడంకులు ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రయాణికులు ప్యాట్నీ… ప్యారడైజ్… బేగంపేట మార్గాలలో ట్రాఫిక్ మళ్లింపులు చేప డుతున్నారు.. అదేవిధంగా, భక్తుల భద్రత కోసం 2,500 మంది పోలీసు సిబ్బంది. 50 సీసీ కెమెరాలు మోహరించను న్నట్లు పోలీసులు తెలిపారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులుచిలకలగూడ నుంచి ప్లాట్ ఫారమ్ నెంబర్ 10 గేటు ద్వారా లోపలికి ప్రవే శించాలని పోలీసులు కోరుతున్నారు. దీంతో అనవసరమైన గందరగోళం తప్పించి, సమయానికి స్టేషన్ చేరుకోవచ్చని సూచించారు. భక్తులు, ప్రయాణికులు ఈ సూచనలను పాటించానలి వేడుకలను భద్రతగా జరుపుకోవాలని ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు.
సికింద్రాబాద్ లష్కర్ బోనాల సందర్భంగా ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 15 మంగళవారం ఉదయం 6 గంటలవరకూ మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. బార్లు, వైన్ షాపులు, కల్లుదుకాణాలు మూసివేయాలని సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
బోనాల సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల నుంచి సికింద్రాబాద్ కు 175 ప్రత్యేక బస్సులు నడు పుతున్నట్లు గ్రేటర్ ఆర్టీసీ ఈడీ రాజశేఖర్ వెల్లడిం చారు. 13, 14 తేదీల్లో జరిగే బోనాలకు నగరం నలు మూలల నుంచి భారీగా భక్తులు తరలివచ్చే అవకా శాలున్న నేపథ్యంలో రద్దీకి అనుగుణంగా స్పెషల్ సర్వీసులు నడిపేలా ఆర్టీసీ ఏర్పాట్లు చేసిందన్నారు. ఎంజీబీఎస్, జేబీఎస్, కాచిగూడ రైల్వే స్టేషన్ తో పాటు ఇతర ముఖ్య ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు.