ప్రతి ఒక్కరు ఓటు హక్కుని వినియో గించుకోవాలి

ప్రతి ఒక్కరు ఓటు హక్కుని వినియో గించుకోవాలి
- జడ్పీసీఈఓ విజయలక్ష్మి
- జ్ఞానతెలంగాణ చిట్యాల ఏప్రిల్ 25:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నైన్ పాక గ్రామంలో మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల లో భాగంగా పెద్దచెరువు పని ప్రదేశాన్ని జెడ్పీ సీఈవో శ్రీమతి విజయలక్ష్మి పర్యవేక్షణ చేయడం జరిగింది. అలాగే ఉపాధి కూలీలు కొలతల ప్రకారం పని చేస్తే రోజుకు 300 రూపాయలు వస్తాయని చెప్పడం జరిగింది మరియు ఓటు హక్కును ప్రతీ ఒక్కరు వినియోగించుకోవాలని కూలీలకు అవగాహన కల్పించడం జరిగింది. వీరి వెంట పి ఆర్ డి ఈ రవి కుమార్ ,ఎపీఓ అబ్దుల్ అలీం, ఇ. సి. సుధాకర్, టి.ఎ. స్వామి, పంచాయతి కార్యదర్శి విష్ణు, ఎన్ ఎం ఎం ఎస్ మేట్ రాజు మరియు కూలీలు పాల్గొన్నారు
