మత్తు, జూదం ఉక్కుపాదంతో అణిచివేయాలి.

మత్తు, జూదం ఉక్కుపాదంతో అణిచివేయాలి.
సిద్దిపేట: గంజాయి, మత్తు పదార్థాలు, పేకాట, జూదంను ఉక్కుపాదంతో అణిచివేయాలని పోలీస్ కమిషనర్ డాక్టర్ అనురాధ అన్నారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్‌లో పెండింగ్ కేసుల పై సమీక్షా సమావేశం జరిగింది.*ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ… శాంతి భద్రత, మహిళల రక్షణకు పెద్దపీట వేస్తూ నేరాలు జరగకుండా ప్రోఆక్టివ్ పోలీసింగ్ విధులు నిర్వహించాలన్నారు. ఎస్సీ ఎస్టీ, ఫోక్సో, క్రైమ్ అగ్నిస్ట్ ఉమెన్, కేసులలో 60 రోజుల లోపు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని ఆదేశించారు. వాహనదారులకు హెల్మెట్ ధారణ గురించి అవగాహన కల్పించి, చలానాలు కట్టించాలన్నారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన అధికారులకు ప్రతి నెల రివార్డ్స్ అవార్డ్స్ అందజేయడం జరుగుతుందన్నారు.
జాతీయ, రాష్ట్ర స్థాయిలో ర్యాంకింగ్ వచ్చే విధంగా పోలీస్ స్టేషన్ ల్లో విధులు నిర్వహించాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నమోదైన కేసులలో విచారణ పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. సైబర్ నేరాలు, మహిళల రక్షణ చట్టాల గురించి షీటీమ్స్, కళాబృందం కార్యక్రమంలో అధికారులు తప్పకుండా పాల్గొనాలన్నారు. రౌడీలు, కేడీలు, సస్పెక్ట్‌ల కదలికలపై నిరంతరం నిఘాపెట్టాలన్నారు. పీడీఎస్ రైస్, ఇసుక అక్రమ రవాణా పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నేరాలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ అందె శ్రీనివాసరావు, ఏసీపీలు సతీష్, రమేష్, సురేందర్ రెడ్డి, ప్రసన్న కుమార్, చంద్రశేఖర్, రవీంద్ర రాజు, ఎస్బీ ఇన్స్ స్పెక్టర్ రఘుపతి రెడ్డి, సీసీఆర్బీ ఇన్స్ స్పెక్టర్ గురుస్వామి, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.