ఎంజిఎం హాస్పిటల్‌కి కొత్త ఇన్‌ఛార్జ్ సూపరింటెండెంట్‌గా డాక్టర్ పి. హరీష్ చంద్ర రెడ్డి నియామకం

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో కీలక నియామకం చేపట్టింది. మంచిర్యాల ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ పి. హరీష్ చంద్ర రెడ్డిను వరంగల్ ఎంజిఎం (MGM) హాస్పిటల్ సూపరింటెండెంట్‌గా ఇన్‌ఛార్జ్‌గా ప్రభుత్వం నియమించింది. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది.
ఈ మేరకు ఆరోగ్యం, వైద్య మరియు కుటుంబ సంక్షేమ (VC.2) విభాగం జి.ఓ.ఆర్.టి. నంబర్ 506, తేదీ 28 అక్టోబర్ 2025న ఆదేశాలు జారీ చేసింది. ఇందులో హైదరాబాద్ వైద్య విద్య డైరెక్టర్ 26.09.2025 మరియు 27.09.2025 తేదీల్లో పంపిన లేఖలు, అలాగే వరంగల్ జిల్లా కలెక్టర్ ఉత్తర్వు నెం.34/పేషి/2025 (తేదీ 23.01.2025)లను పరిశీలించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.ఆదేశాల ప్రకారం, వరంగల్ ఎంజిఎం హాస్పిటల్ ఆర్థోపెడిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ కె. కిషోర్ కుమార్ను సూపరింటెండెంట్‌గా ఉన్న FAC బాధ్యతల నుండి తప్పించగా, ఆయన స్థానంలో డాక్టర్ పి. హరీష్ చంద్ర రెడ్డిని ఇన్‌ఛార్జ్ సూపరింటెండెంట్‌గా నియమించారు.ఇక, మంచిర్యాల ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ పదవికి అవసరమైన ఇన్‌ఛార్జ్ ఏర్పాట్లు చేయాలని, తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని వైద్య విద్య డైరెక్టర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.డాక్టర్ పి. హరీష్ చంద్ర రెడ్డి తన అసలు పోస్టింగ్ అయిన మంచిర్యాల ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నుంచే జీతం పొందుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది.
