ప్రభుత్వ స్థలాల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దగ్గర పనిచేసిన వారికి డబుల్ బెడ్రూం ఇళ్లు..

ప్రభుత్వ స్థలాల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దగ్గర పనిచేసిన వారికి డబుల్ బెడ్రూం ఇళ్లు..

జనగామ జిల్లా:**ఇండ్లు లేని పేదలకు గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన డబుల్ బెడ్రూం ఇండ్లు నిరుపేదలకు ‘వరం’అని చెప్పుకోవచ్చు.**కానీ అలాంటి నిరుపేదలకు అందాల్సిన ఇడ్లు బిఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్లకు అందితే అది ఆ పార్టీకి ఉన్న ‘బలం’అని చెప్పుకోవచ్చు.*ఇప్పుడు అదేంటో తెలుసుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది.దేవరుప్పుల మండలకేంద్రంలో *ప్రభుత్వ స్థలంలో నూతనంగా పేదలకు నిర్మించి ఇచ్చిన డబుల్ బెడ్రూం ఇండ్లు* పోను ఇంకా అక్కడ ప్రభుత్వ ఖాళీ స్థలం ఉండగా ఇప్పటికే అక్కడ దేవరుప్పుల మండలానికి చెందిన *పాత్రికేయులు సీనియర్లు,జూనియర్లు,ఇతర జిల్లాకు చెందిన వాళ్ళు(బిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నవాళ్లు) డబుల్ బెడ్రూం ఇండ్లు 11* నిర్మించుకున్నారు.అసలు అవి ఏ ప్రాతిపదకన నిర్మించుకుంటున్నారో ఎవరికి అర్థం కాని సంగతి.అక్కడితో ఆగక అవి పోను ఇంకా అక్కడ ప్రభుత్వ స్థలం మిగిలి ఉండగా *మరి కొంతమంది మీడియా మిత్రులు అదే విషయాన్ని పలుమార్లు మంత్రికి* విన్నవించుకోగా *’మేము దొంగలకు ఇస్తలేము'(అంటే ప్రతిపక్ష నాయకుల వార్తలు వేసే వారిని)* అని ముక్కుసూటిగా చెప్పేసరికి ఇక చేసేదేం లేక వెనుదిరిగి పోయారు.బిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా,*మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దగ్గర పని చేసిన వారికి(జర్నలిస్టులు కాకుండా) ప్రభుత్వ స్థలంలో అక్రమార్కంగా అక్కడ డబుల్ బెడ్రూం ఇండ్లను వారికి ఇష్టం వచ్చినట్లు* నిర్మించుకుంటున్నారు.అసలు ప్రభుత్వ స్థలంలో ఏ అధికారంతో ఇండ్లను నిర్మించుకుంటున్నారు.?అసలు *ప్రభుత్వ స్థలాన్ని అక్రమంగా ఆక్రమంచుకుంటే చట్టపరంగా చర్యలు* తీసుకోవాలి.కానీ అందుకు విరుద్ధంగా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తుండగా గుట్టుచప్పుడు కాకుండా ఇండ్లను నిర్మించుకుంటున్నారు.అడిగే వారు లేరు.పట్టించుకునే వారు లేరు.?ఇష్టానుసారంగా *బిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు కమీషన్లకు కక్కుర్తిపడి* నిరుపేదలకు చెందాల్సిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారికి అనుకూలంగా ఉన్న వారికి అందజేస్తున్నారు.ఇదెక్కడి న్యాయం అని తెలిసిన *ప్రతిపక్ష నాయకులు ముక్కున* వేలేసుకున్నారు.ఇక ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలని స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు.

You may also like...

Translate »