ఆర్టిసి బస్సును ఢీకొట్టిన డీసీఎం వ్యాన్

  • రాజేంద్రనగర్ ఆరంగర్ చౌరస్తా వద్ద ఘటన
  • స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు

జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్,నవంబర్ 7 :

చేవెళ్ల బస్సు ప్రమాద ఘటన మరవకముందే బస్సు ప్రమాదాల పరంపర కొనసాగుతుండడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శుక్రవారం ఉదయం ఆరంఘర్ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది షాద్నగర్ నుంచి హైదరాబాద్ వెళుతున్న ఆర్టీసీ బస్సును వెనుకనుంచి వేగంగా వచ్చిన డీసీఎం వ్యాన్ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించడం జరిగిందని తెలిపారు.రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

You may also like...

Translate »