బీసీ బంద్ లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఇటీవల జీవో విడుదల చేయడం జరిగింది ఆ జీవోను హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేయడంతో రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ తెలంగాణ బీసీ బంద్ కు పిలుపునిచ్చిన తరుణంలో
మల్కాపూర్ ఎక్స్ రోడ్ కొండాపూర్ మండల్ మరియు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బీసీ సంఘాలు నిర్వహించిన వివిధ ర్యాలీలలో గౌరవ కాంగ్రెస్ టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి డిసిసి చైర్మన్ రామ్ రెడ్డి, కూన సంతోష్, జార్జి, సీనియర్ నరసింహారెడ్డి, జి నర్సింలు, మార్కెట్ కమిటీ చైర్మన్ కుమార్, యువసేన మండల అధ్యక్షులు అనంతరావు, ప్రభుదాస్ శ్రీనివాస్ గౌడ్ మాజీ సర్పంచ్ వెంకటేష్ జిల్లా జేఏసీ చైర్మన్ ప్రభు గౌడ్, పార్వతి కృష్ణ, యమ్ శేఖర్, మల్లికార్జున్, మంజుల గౌడ్ జిల్లా అధ్యక్షురాలు, యమ్ శీను, మామిడిపల్లి అనిల్ కుమార్, కందుకూరి అనూష కృష్ణ, గ్రామ అధ్యక్షుడు ఆంజనేయులు, ఎండి మోసిన్, భాను, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బీసీలకు హక్కుగా లభించాల్సిన రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ కల్పించి బీసీలకు న్యాయం చేయాలని చూస్తున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని అణిచివేయాలని కొందరు వ్యక్తులు రాష్ట్ర హైకోర్టు ద్వారా స్టే విధించడం బాధకరమన్నారు ఎన్ని అడ్డంకులు ఎదురైనా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ అమలుపై కట్టుబడి ఉందని బీసీల పట్ల ప్రభుత్వానికున్న చిత్తశుద్ధితో న్యాయం కోసం అవసరమైతే సుప్రీంకోర్టులో పోరాడి బీసీలకు 42% రిజర్వేషన్లు అందించే వరకు కాంగ్రెస్ పార్టీ బీసీలకు అండగా ఉంటుందని తెలిపారు.

You may also like...

Translate »