మాజీ రాష్ట్రపతిని మర్యాద పూర్వకంగా కలిసిన సీఎం రేవంత్ రెడ్డి.

మాజీ రాష్ట్రపతిని మర్యాద పూర్వకంగా కలిసిన సీఎం రేవంత్ రెడ్డి.
హైదరాబాద్ జనవరి 06:మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈరోజు హైదరా బాద్ పర్యటనకు వచ్చారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. రాజ్భవన్లో ఉన్న ఆయన వద్దకు సీఎం రేవంత్ వెళ్లారు. మాజీ రాష్ట్రపతికి పుష్పగుచ్ఛం అందించారు రామ్ నాథ్ కోవింద్ కు రేవంత్ రెడ్డి వీణను బహుకరించారు.ఆయనతో కాసేపు వివిధ అంశాలపై చర్చించారు. దేశమంతా ఒకేసారి ఎన్ని కలు నిర్వహించడంపై సాధ్యాసాధ్యాల అధ్యయ నం కోసం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృ త్వంలో కేంద్రం ఓ కమిటీ ఏర్పాటు చేసింది.ఈ కమిటీకి ఛైర్మన్గా రామ్ నాథ్ కోవింద్ ఉన్నారు.