తాండూరు ఎమ్మెల్యే కుటుంబ వివాహ వేడుకలో ప్రముఖుల సందడి

  • జన్వాడ సమీపంలోని కె. కన్వెన్షన్ హాల్‌లో వైభవంగా వేడుక
  • ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు నేతల హాజరు

జ్ఞాన తెలంగాణ,శంకర్‌పల్లి ప్రతినిధి,నవంబర్ 9:
శంకర్‌పల్లి మండలం జన్వాడ గ్రామ సమీపంలోని కె. కన్వెన్షన్ హాల్‌లో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సోదరుడు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి కుమారుని వివాహ వేడుక వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

వివాహ వేడుకకు తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర సమాచార, రెవెన్యూ మరియు గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా చేవెళ్ల శాసనసభ్యుడు కాలే యాదయ్య కూడా పాల్గొని, వధూవరులను ఆశీర్వదించారు. వివాహ వేడుకలో రాష్ట్ర రాజకీయ రంగానికి చెందిన పలువురు నేతలు, ప్రజాప్రతినిధులు, మిత్రబృందాలు పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.


You may also like...

Translate »