ప్రయాణికులతో బస్టాండ్, రైల్వే స్టేషన్లు కిటకిట.

ప్రయాణికులతో బస్టాండ్, రైల్వే స్టేషన్లు కిటకిట.
హైదరాబాద్ జనవరి 13: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్ వైపు వెళ్లే రైళ్లలో భారీ రద్దీ కనిపిస్తోంది సికింద్రా బాద్ నుంచి కాకినాడ, విశాఖపట్నం ఇంటర్‌సిటీ వంటి ముఖ్యమైన ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ప్రయాణికులు మూడు నెలల ముందుగానే టికెట్ రిజర్వేషన్లు చేయిం చుకున్నారు.
వాటిల్లోకి సాధారణ ప్రయాణికులు ఎక్కేస్తుండడంతో రిజర్వేషన్ తీసుకున్న ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
ప్రయాణికులతో బస్టాండ్లు కిటకిట.
మహాత్మాగాంధీ జూబ్లీ బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి సాధారణ రోజుల్లో బస్సుల్లో 1.6 లక్షల మంది ప్రయాణాలు సాగిస్తే రెండు రోజులుగా రెట్టింపు సంఖ్యలో ప్రయాణికులు జిల్లాలకు వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఏపీ తెలంగాణ జిల్లాలకు రెగ్యులర్ సర్వీసులతో పాటు గురువారం రాత్రి 8 గంటల వరకు 975 ప్రత్యేక బస్సులు నడిపినట్లు రంగారెడ్డి ఆర్‌ఎం శ్రీధర్ తెలిపారు.
రాత్రి 12 గంటల వరకు 1250 బస్సులు జిల్లాలకు వెళ్లే అవకాశముందన్నారు శనివారం రద్దీ మరింత పెరిగితే బస్సుల సంఖ్య పెంచేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
జిల్లాలకు వెళ్లే పల్లెవెలుగు ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహాలక్ష్మి పేరుతో మహి ళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆయా బస్సుల్లో ప్రయాణానికి పోటీ పడుతున్నారు.
శివారు ప్రాంతాల నుంచే పలు జిల్లాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడు పుతోంది ఉప్పల్ ఎల్‌బీనగర్ ప్రాంతాల్లో ప్రయాణికులు రోడ్లపై పడిగాపులు కాస్తున్నారు పలు ప్రాంతాల్లో ప్రత్యేక టెంట్లు ఏర్పాటు చేసి ఆర్టీసీ ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది.
ఆర్టీసీ బస్సులు రద్దీగా మారడంతో ప్రైవేట్ బస్సుల్లో రెట్టింపు చార్జీలు చెల్లించి సొంతూళ్లకు వెళ్లేందుకు నగరవాసులు క్యూ కట్టారు ఏపీ తెలంగాణ జిల్లాలకు వెళ్లే బస్సులతో మియాపూర్ కూకట్‌పల్లి అమీర్‌పేట ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం సమస్యలు నెలకొన్నాయి.
